Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాక్షన్ ప్రధానంగా.. అఖిల్‌ ‘హలో’ టీజ‌ర్ విడుద‌ల‌!

  • త‌న‌లోని మాస్ కోణాన్ని చూపించిన అఖిల్‌
  • టీజర్లో హీరో సాహసాలను హైలైట్ చేశారు 
  • రొమాంటిక్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా రూపుదిద్దుకుంటోన్న 'హ‌లో'
అక్కినేని అఖిల్‌ న‌టించిన‌ ‘హలో’ సినిమా టీజ‌ర్ ఈ రోజు విడుద‌లైంది. ఒక మేడపై నుంచి మ‌రో మేడపైకి దూకుతూ, విల‌న్ల‌తో పోరాడుతూ అఖిల్ తన మాస్ యాంగిల్‌ని చూపించాడు. ఈ టీజ‌ర్‌ను పూర్తిగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద కట్ చేశారు. చివర్లో మాత్రం 'హ‌ల్లో' అంటూ అఖిల్ వాయిస్ వినపడుతుంది. ముఖ్యంగా ఇందులో అఖిల్ సాహ‌సాల‌ను హైలైట్ చేసి చూపించారు.

'మనం' ఫేం విక్రమ్‌ కె.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌ కుమార్తె కల్యాణి ఈ సినిమా‌లో హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. రొమాంటిక్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు అనూప్‌ రుబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వ‌చ్చేనెల‌ 22న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తున్నారు.  

ఈ టీజ‌ర్ ప్రారంభంలో నాగార్జున ‘ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు’ అంటూ వాయిస్ ఓవర్ చెప్పారు.



hello
akhil
teaser

More Telugu News